తను చెనిపోతూ ఐదుగురును బ్రతికించాడు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సోంపేట గ్రామానికి చెందిన మల్లారెడ్డి కిరణ్‌చంద్ బ్రెయిన్ డెడ్ కావడంతో తన అవయవాలను కుటుంబ సభ్యులు గ్రీన్ ఛానల్ సమాచారం అందించడంతో కిరణ్‌చంద్ అవయాలను సేకరించారు.పదవతరగతి పరిక్షలు రాస్తూ తనకు తలనొప్పివుందని ఆసుపత్రికి రాగా బ్రెయిన్‌లో నరాలు చిట్లుతున్నాయని వైద్యులు గుర్తించి వైద్యం అందించారు అయినా ఫలితం లేకుండా పోవడంతో విద్యార్ది బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించడంతో జెమ్స్‌హాస్పిటల్‌లో అవయవాలు వేరు హుటాహుటానా విశాఖపట్నం తరలించారు.అక్కడనుండి వేరు ఆసుపత్రులకు అవయాలు పంపించారు.తను చెనిపోతూ ఐదుగురుకు ప్రాణం పోసిన ఆ విద్యార్ది అందరికీ ఆదర్శంగా నిలిచారు.కనిపెంచిన తల్లిదండ్రులు త్యాగానికి ఈ సమాజం ఎప్పటికీ రుణం పడివుంటుందని అంటున్నారు.