తుఫానుగా మారనున్న అల్పపీడనం
రానున్న 12గంటలలో అల్పపీడనం తుఫానుగా మారుతుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.అండమాన్ వద్ద ఏర్పడిన ఈ అల్పపీడనం క్రమేపి బలపడి ఈనెల 3వతేదీనాటికి తుఫానుగా మారే అవకాశం వుందని తెలిపింది.అల్పపీడనం ఏర్పడిన తరువాత అది వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఉత్తరాంద్ర`ఒడిస్సా రాష్ట్రాలు మద్య తీరం దాటే అవకాశం వుందని తెలిపారు.మూడునుండి నాలుగో తేదీ వరకూ ఉత్తరాంద్ర అనేక చోట్ల బారీనుండి అతిబారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.మూడో తేదీనుండి సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని అందువల్ల మత్స్యకారులు ఎవరూ సముద్రం పైకి వెళ్లవద్దుని హెచ్చరికలు జారీచేశారు.