తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత స్దానం కల్పించిందిజకొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాణ పేరు పెట్టాలని సిఎం కేసిఆర్ నిర్ణయంచారు.ఈ మేరకు ఇందుకు సంబందించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రదానకార్యదర్శి సోమేష్‌కుమార్ కు సిఎం ఆదేశాలు జారీ చేశారు.ఈ నిర్ణయం యావత్తు బారతదేశానకి ఆదర్శమన్నారు.సిఎం.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాలు ప్రజలను కూడా మానవీయుత పాలన అందిస్తుందని తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ కలలుగన్న భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కూడిన ప్రత్యేకప్రజాస్వామ్యక లక్షణం ఉన్నదని సిఎం అన్నారు.ఇదే స్పూర్తితో నూతనంగా నిర్మిస్తున్న పార్లమొంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండు చేస్తుందని సిఎం కేసీఆర్ తెలిపారు