దేవుడికి హారతి ఎందుకు ఇస్తారు…? భక్తి సమాచారం
గర్బాలయంలో భగవంతుని విగ్రహముఖం స్పష్టంగా కన్పించేందుకు తగిన సాధనం హారతి.హారతి ఇవ్వగానే భగవంతనిస్వరూపం స్పష్టంగా కన్పిస్తుంది.దైవంపై ఏకాగ్రత కలుగుతుంది.దైవంపై ద్యాస కలుగుతుంది.ఇక హారతి ఇవ్వడం వల్ల ఆద్యాత్మిక రహస్యం ఏమిటంటే పరాత్పరుడు జ్యోతిస్వరూపుడు,ఆయనను జ్యోతిగానే దర్శించాలి,ఆ పరంజ్యోతి మనలో ఆంతర్జ్యోతిగా వెలుగొందుతోందని తెలుసుకోవాలి,ఈ అవగహన కోసమేవాటి ప్రతీకగా హరతి వెలిగిస్తారు.