ధనుర్మాస ఉత్సవాలు
3వ పాశురం తాత్పర్యం
బలిచక్రవర్తి ఇచ్చిన దానమునందు ఆకాశము వరకూ పెరిగి మూడు లోకాలలో తన పాదములుచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్యనామములు గానం చేసి మేము మాత్రం మా వ్రతం దేశమంతయు వానలు నెలకు మూడు ,ఈతి బాదలు లేకుండా లేక సుఖముగా వుండవలెను.ఆకాశం వరకుపెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్లిపడుచుండగా కలువు పూవులతో మనోహరంగా తుమ్మోదలు నిద్రించుచుండగా సస్యములు సమృద్దిగా యుండవలెను.పాలు పితుకు టకై కొట్టములో దూరి,స్దిరంగా కూర్చిండి పొదుగు నంటగనే పాలు కుండలలో నిండినట్లు చేవు గోవులు సంవృద్దిగా వుండవలెను దేశమంతటా సర్వస్వం ఐశ్వర్యంలో నిండిపోవాలని సంపద దేశమంతటా నిండవలెను.