నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టరు గా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టరుగా బి.ప్రసాదరావు సోమవారం భాద్యతలు స్వీకరించారు.సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఐలు పుష్పగుచ్చం ఇచ్చారు.ఈ సందర్బంగా ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలుతో మమేకమై సమస్యలు ఎప్పటికపుడు పరిష్కరించేవిదంగా ప్రజలుకు చేరువ కావాలని అన్నారు.శాంతి భద్రతలు పరిరక్షణ,అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలును గుర్తించి వ్యక్తులుపై కఠిన చర్యలు తీసుకోవాలని,క్రైం రేటు తగ్గించే విదంగా ముందుడుగు వేయాలని,ఆలాగే జాతీయ రహదారికి ఆనుకునివున్న ప్రాంతం కాబట్టి గుట్కా.గంజాయి మాదకద్రవ్యాలు అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి సమాచారం అందినవెంటనే దర్యాప్తువేగవంతం చేసేవిదంగా ప్రయత్నం చేయాలని సూచించారు.అనంతరం సిబ్బందినికలుసుకున్నారు.