నాటు సారా తయారీ పై ఉక్కుపాదం

0
645
telugu news

నాటు సారా తయారీ స్థావరాలును జల్లిడి పట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం.జిల్లా ఎస్పీ స్వీయ అధ్వర్యం లో మెలుయపుట్టి మండలంలోని దినబందుపురం,కెరసింగ్ గ్రామలలో జరిగిన పరివర్తన 2.0 ప్రత్యేక రైడ్.శ్రీకాకుళం జిల్లాలో నాటు సారా తయారీ పై ఉక్కుపాదంనాటుసారా తయారీని ఉపేక్షించేది లేదు.స్వయంగా నాటు సారా స్థావరాలపై ప్రత్యేక రైడ్,బెల్లపు ఊటలను నిర్వీర్యం చేసిన జిల్లా ఎస్పీ  జి.ఆర్. రాధిక.జిల్లా ఎస్పీ శ్రీమతి జి ఆర్ రాధిక స్వీయ పర్యవేక్షణలో మంగళవారం పోలీస్,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు,సిబ్బంది మెలుయపుట్టి మండలంలోని దినబందు,పరిసర గ్రామాలులో నాటుసారా తయారీ స్థావరాల పై మెరుపు దాడులు నిర్వహించారు.ఈ క్రమంలో 2,250 లీటర్ల బెల్లపు ఊట,500 కేజీల నల్ల బెల్లం ధ్వంసం చేసి,50 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ శ్రీమతి జి ఆర్ రాధిక స్వయంగా పోలీసు, సెబీ జాయింట్ డైరక్టర్ కె శ్రీనివాసరావు, సిబ్బంది జిల్లాలోని మెలియపుట్టి మండలంలో పలు నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు జగిగాయి.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతు నాటుసారా తయారీ క్రయవిక్రయాలకు పాల్పడకుండా సామాన్యమైన జీవనాన్ని అలవర్చుకొని పిల్లలు ప్రగతికి దృష్టిసారించి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని నాటు సారా రహిత గ్రామాలకు కృషి చేయాలని తెలిపారు.నాటుసారా సేవించడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని సందర్భాల్లో మరణము కూడా సంభవించే అవకాశం ఉందని కావున దయవుంచి ప్రజలు ఎవరు నాటుసారా జోలికి వెళ్లవద్దని కోరినారు.ఈ ప్రత్యేక రైడ్ లో యస్ఈబి జేడి కె శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ కె.పి గోపాల్ డిఎస్పీ ఎం శివరామ రెడ్డి, యస్ఐ సందీప్, యస్ఈబి, పోలీసు అధికారులు సిబ్బంది ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here