మనిషికి తిండి ఎంత అవసరమో నిద్రకూడా అంతే అవసరం అటువంటి నిద్ర నియమాలుతో చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.మనిషి నిర్జీవ ప్రదేశాలలో దేవాలయలంలో స్మశాన ప్రాంతాలలో నిద్రించకూడదని మనుస్మృతి లో తెలుపుతున్నారు.అంతేకాకుండా విష్ణుస్మృతిలో పడుకున్న వారిని అకస్మాత్తుగా లేపకూడదని తెలుపుతుంది.చాణిక్యనీతిలో చెప్పిన విదంగా విద్యార్దులు,నౌకర్లు,ద్వారపాలకులు అదిక సమయం నిద్రపోకూడదని తెలిపింది.అంతేకాకుండా సూర్యోదయం అయ్యేంతవరకూ నిద్రపోకూడదని ,అలా పడుకుంటే ఆత్మలు వస్తాయని .ఆరోగ్యచిక్కులు కలుగుతాయని అంటున్నారు.ఏదిఏమైనా సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించి వేకువరaామున నిద్రమేల్కోని దైవారాదన చేస్తే వంటికి ఇంటికి శుభం కలుగుతుంది.