నీలమణి దుర్గా అమ్మవారు ప్రతిష్టామహుత్సావాలు
ఉత్తరాంద్ర ఇలవేల్పు అమ్మలగన్న అమ్మ శ్రీనీలమణి దుర్గా అమ్మవారు ప్రతిష్టామహుత్సావాలు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కాకితాపల్లి గ్రామంలో మూడురోజులుపాటు ఘనంగా నిర్వహించారు.వేదపండితులు వేదమంత్రోచ్చరణలు నడుమ శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.మొదటిరోజు మండపారాదనలు,నవగ్రహాలు పూజలు,మండపం పూజలు క్షీరాదివాసం,దాన్యాదివాసంతదితర పూజలు అబిషేకాలు నిర్వహించారు.రెండువరోజు కుంకుమార్చనలు,మండపారాదనలు,హామజపాలు,జరిపారు.మూడువరోజు పూర్ణాహుతి,అనంతరం నీలమణిదుర్గా అమ్మవారు,గణపతి,సుబ్రమణ్యం స్వామి ,నాగబందం,పోతురాజు,పాదాలు ప్రతిష్టాకార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాలు మూడు రోజలు పాటు అత్యంత కన్నులు పండుగగా నిర్వహంచారు,వేద పండితులు సుబ్రమణ్యంశర్మ,బాలమురళీకృష్ణ శర్మ ఆద్వర్యంలో వేదపండితులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రయుక్తంగా జరిపారు.