నేడు గుంటూరు జిల్లాలో సిఎం పర్యటన
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్ద ఏర్పాటుచేసిన కేంద్రీకృత వంటశాలను ఎపి సిఎం వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.రాష్ట్రప్రభుత్వంతరుపున పాఠశాలలకు మద్యాహ్న బోజన పధకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడనుండే తయారుచేయునున్నారు.ఇక్కడనుండి జిల్లాలోని వివిద ప్రాంతాలలో సరఫరా చేయునున్నారు.దీనికోసం అక్షయ పాత్ర పౌండేషన్ అత్యాదునక వంటశాల సిద్దం చేసింది.అక్కడే ఇస్కాన్ 70కోట్లుతో ఏర్పాటుచేసిన గోకుల క్షేత్రానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేయునున్నారు.ఇస్కాన్ తరుపున ఎపిలో ఇదే పెద్ద ప్రాజెక్టు,వీటితో పాటు వెంకటేశ్వరస్వామి,రాధాక్రిష్ణులు ఆలయాలు నిర్మించనున్నారు.యోగద్యాన కేంద్రాలు,సంప్రదాయ నృత్యాలు,ప్రదర్శంచేందుకు కళాక్షేతాలు కూడా ఏర్పాటుచేయునున్నారు.గోకుల క్షేత్రానికి భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.