పలాస సబ్‌రిజస్ట్రార్‌ కార్యాలయంలో వసూల్‌ లు పర్వం…

0
471
telugu news

పలాస సబ్‌రిజస్ట్రార్‌ కార్యాలయంలో వసూల్‌ లు పర్వం…
` దిగువస్దాయి సిబ్బంది చేతివాటం
` సబ్‌ రిజస్ట్రార్‌కు తెలియుకుండా గుట్టు చప్పుడు కాకుండా పనులు
` ప్రతిపనికి ఒక రేటు
` జిల్లా రిజస్ట్రార్‌ పేరు వాడుతున్న సీనియర్‌ అసిస్టెంట్‌
`శ్రీకాకుళంలో సంతకం… అనదికారంగా పలాసలో ఉద్యోగం
` చోద్యం చూస్తున్న అధాకార్లు …
శ్రీకాకుళం:(స్పెషల్‌ కరెస్పాండెంట్‌) శ్రీకాకుళం జిల్లా పలాస సబ్‌రిజస్ట్రార్‌ కార్యాలయం ఎవరి వారు యమునా తీరుగా కన్పిస్తుంది.ఇక్కడ దిగువస్దాయి సిబ్బంది హవా గతంనుండి కూడా జరుగుతుంది.గతంలో సీనియర్‌ అసిస్టెంట్‌ కు సబ్‌ రిజస్ట్రార్‌గా కొంత కాలం అదనపు భాద్యతలు అప్పగించారు.ఆ సమయంలో ఎక్కువ వసూలు పర్వం సాగిందని స్దానికులు అంటున్నారు.ఆతరువాత తవిటయ్యను ఇక్కడ సబ్‌రిజస్ట్రార్‌గా భాద్యతలు తీసుకున్న తరువాత సమస్యలును దిగువస్దాయి సిబ్బంది తీసుకువచ్చారు.అప్పటిలాగా కలెక్షన్లుకు అడ్డుకట్టు వేయుడంతో సిబ్బందికి మింగుడు పడడం లేదు.ఇక్కడ ఎవరి మాట వారిదే.ప్రతిపనికీ ఓక రేటు నిర్ణయించారు.పేద ధనిక బేదం లేకుండా పెండి రిజస్ట్రేషన్‌ కోసం వస్తే ఇక్కడ ముందుగా 500రూపాయిలు చెల్లించవలసిందే …లేక పోతే ఆ పని జరగదు.డాక్యుమొంటు ఫీడిరగ్‌ కోసం 500 వసూలుచేస్తున్నారని రిజస్ట్రేషన్‌ చేయించుకున్నవారు అంటున్నారు.అలాగే ఈకెవై చేయుడానికి 100నిర్ణయించారు.ఇంత బాహాటంగా వసూలు చేస్తున్నా పై అదికార్లుకు తెయుకపోవడం విశేషం.శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీదర్‌ ఏకంగా పలాసలో మకాం వేసి జిల్లా రిజస్ట్రార్‌ పేరు వాడడం..జిల్లా రిజస్ట్రార్‌ పంపితే వస్తున్నానని ,చెబుతున్నారని స్దానికులు అంటున్నారు.అంతేకాకుండా జూనియర్‌ అసిస్టెంట్లు భారతి,శిరీష లుకూడా ఈ కలెక్షన్లు పర్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అక్కడ వారు అంటున్నారు.ఈ వ్యవహారం అంతా కూడా సభ్‌రిజస్ట్రార్‌ తవిటయ్యకు తెలియుకుండా ,జరుగుతున్నట్లు ప్రాధమిక సమాచారం.జిల్లా రిజస్ట్రార్‌ ఈ విషయంలో అతని పేరు వాడుతున్నా ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోక పోవడం పెద్దచర్చాంశనీయుంగా మారింది.ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారనుంది.ఇప్పటికైనా ఈ వ్యవహారం పై తగు నిర్ణయం అదికార్లు తీసుకోవాలని స్దానికులు కోరుతున్నారు.
ఇంతకీ ఈ శ్రీదర్‌ ఎవరు..?
శ్రీకాకుళం రిజస్ట్రార్‌ కార్యాలంలో సీనియర్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తూ ఎటువంటి డిప్టేషన్‌ ఆర్డర్‌ లేకుండా పలాసలో విధులు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని స్దానికులు ప్రశ్నిస్తున్నారు.అతని కనుసైగలో ఈ వ్యవహారం జరుగుతుందిని,జిల్లానుండి ప్రత్యేకంగా డిఆర్  తనని పంపిస్తున్నారని,ప్రశ్నిస్తే పనులు ఆగిపోతాయని రిజస్టేషన్లుకు వచ్చినవారిని సున్నితంగా వార్నింగ్‌ ఇస్తున్నారు.అసలు డిఆర్‌ పేరును ఎందుకు వాడుతున్నారని అందరూ అనుకుంటున్నారు.
నాకు ఈ విషయం తెలీదు..సబ్‌రిజస్ట్రార్‌ తవిటయ్య
ఈ వ్యవహారం పై సబ్‌రిజస్ట్రార్‌ తవిటయ్యను ప్రశ్నించగా తనకు ఈవ్యవహారం తెలీదని ,రిజస్టేషన్లు కు వచ్చిన వారు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నారని అంటున్నారని,విషయం తెలుసుకుని పూర్తి నివేదిక జిల్లా రిజస్ట్రార్‌కు వివరిస్తానని పై అదికార్లు దృష్టికి ఈ వ్యవహారంలో పరిశీలించి తగు సమాచారం అందించడం జరగుతుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here