పవన్ కళ్యాణ్‌కు పరిజ్ఞానం లేదు`ధర్మాన
శ్రీకాకుళం: రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పధకాలు అమలుచేయుడంతో వలంటీర్లు వ్యవస్దఎంతో కష్టపడి పనిచేస్తుందని అటువంటి వ్యవస్దలను విమర్శించడం జనసేన పార్టీ అద్యుక్షులు పవన్ కళ్యాణ్‌కు తగదని రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.శ్రీకాకుళం జిల్లా రాగోలులో మంత్రి మాట్లాడుతూ సినిమా వేరు జీవితం వేరు సమాజం వేరు అది తేడా తెలుసుకుని మాట్లాడం నేర్చుకోవాలని అన్నారు.అటువంటి వ్యక్తి ఆడే మాటలకు ప్రతి విమర్శలు చేయుడం కూడా అవసరం లేదని అన్నారు.వ్యవస్దలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలని ఏదో సినిమాలా కద నడిపిస్తామంటే అవేమి కుదరవని అన్నారు.అసలు ఏమి తెలుసునని పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడని ,అటువంటి బ్రోకర్లు మాటలు వలంటీర్లు పట్టించుకోవలసిన పనిలేదని మీ పనిమీరు చేయుండని అన్నారు.