పారదర్శకంగా ఓటర్లు జాబితా
శ్రీకాకుళం: ఓటర్లు జాబితా ను అత్యంత పారదర్శకంగా తయారు చేస్తున్నట్లు ఎన్నికలు రోల్ అబ్జర్వుర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే అన్నారు.జిల్లాలోని జరుగుతున్న ఓటర్లు జాబితా పునశ్చరణ కార్యక్రమంపై జిల్లా కలెక్టరు కార్యాలయంలో శనివారం సంబందిత అధికారులుతో సమిక్షాసమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిదులు ను ఎన్నుకోవడంలో ఓటర్లు జాబితా కీలక పాత్ర పోషిస్తుందని పారదర్శకంగా గ్రామీణ స్దాయినుండి అర్హులైన వారందరకి ఓటు హక్కు కల్పించే విదంగా జాబితా తయారు చేయాలని అన్నారు.ప్రతి ఓటరు ఓటు స్వేచ్చగా వినియెగించుకునేవిదంగా లిస్టులు తయారు చేయాలని తెలిపారు.అర్హుడైన ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని ,తప్పుఓప్పులు సరిచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తయారు చేయాలని తెలిపారు.గిరిజన ప్రాంతాలు ,మత్స్యకారులు ప్రాంతాలలో ప్రతిఇంటికి వెల్లి సర్వే నిర్వహించి ఒటర్లుగా నమోదు చేయించాలని తెలిపారు.ఓటర్లు ను తొలిగించేటప్పుడు ప్రత్యక్షంగా వారి వివరాలు తెలుసుకుని నిర్దారణ జరిగిన తరువాత ఒటు హక్కును తొలిగించాలని ,జరిగిన తరువాత ఒటు హక్కును తొలిగించాలని ,ఆయన ఆదేశించారు.ఓటర్లు లిస్టులలో చాలా తప్పులు దొర్లుతున్నాయని వాటిని సరిచేయాలని తెలిపారు.జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లు జాబితా కార్యక్రమం పకద్బందీగా జరుగుతుందని జిల్లాలో 2910పోలింగ్ కేంద్రాలువున్నాయని,22,67,979మంది ఓటర్లు వున్నారనితెలిపారు.ఈనెల 20,21తేదీలలో ప్రత్యేక ఓటర్లు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
Please link voter ID with Aadhar ID