పిల్లలకు బండి ఇస్తే మీరు జైలుకే…
దేశంలో రానురాను రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా మారడంతో అంతేకాకుండా మైనర్లు డ్రైవింగ్‌లో ఎక్కువగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ప్రభుత్వం ట్రాఫిక్ రూల్సును కఠినతరం చేసింది.మైనరు పిల్లలకు బండిఇస్తే వారు తనిఖీలలో పట్టుబడితే తల్లిదండ్రులుకు శిక్ష ఖరారు కానుంది.పిల్లలకు బండి ఇచ్చి ముచ్చటవుంటే జైలు కు వెళ్లే మార్గం వెదుక్కోవసివస్తుంది.వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే సదరు వాహనదారుడుకు 25వేలు జరిమానావిదించే అవకాశాలువున్నాయి.ఈ మొత్తం కూడా 15రోజులలో కట్టాల్సిందేనని ,వారికి 25సంవత్సరాలు వరకూ డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చేపరిస్దితి లేదని రవాణాశాఖాదికార్లు నియమాలు కఠినతరం చేయునున్నారు.మైనర్లు వాహనం నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తే మూడేళ్లజైలుశిక్ష విదించే అవకాశం వుంది.అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు పూర్తిస్దాయిలో డ్రైవింగ్ లైసెన్సులు వచ్చేవరకూ వాహనాలు ఇవ్వవద్దు అంటున్నారు అదికార్లు.