పిల్లల్లో సృజనాత్మకత గుర్తించాలి
శ్రీకాకుళం: పిల్లల్లో వున్న సృజనాత్మకత గుర్తించి ఉపాద్యాయులు తల్లిదండ్రులు తగిన విధంగా ప్రోత్సహించాలని జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖాదికారి కె.అనంతలక్ష్మి అన్నారు.సోమవారం స్దానిక బాలికోన్నత పాఠశాలలో జిల్లా స్త్రీ శిశుసంక్షేమశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన బాలలదినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిదిగా పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పిల్లలకు ఆటపాటలు,క్రీడలను నిర్వహించి వారిలో ఆలోచన కలుగచేసేవిధంగా ప్రేరణ కలుగచెయ్యాలని స్పష్టంచేశారు.నేడు సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ది అయిన క్రీడలను ,విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.రాష్ట్రప్రభుత్వం పిల్లలు పుట్టకుముందునుండే చదువుకునే వరకూ ఎన్నో సంక్షేమ పధకాలను అమలుచేస్తూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం అడుగులు వేయుడం జరుగుతోందని అన్నారు.గర్బస్తు శిశువునుండి బడిఈడు పిల్లలు వరకూ ప్రతిఅడుగు లో జగనన్న తోడుగా నిలుస్తున్నారని అన్నారు.