పోలీస్ వ్యవస్దలో విప్లవాత్మక మార్పులు `హాం మంత్రి మేకతోటి సుచరిత
విజయవాడ: వైయస్సాఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలీస్ వ్యవస్దలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని హాం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్ ఆమె ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో కోర్టులో చార్జీషీటు లు వేసేందుకు 250రోజులు పట్టేదని,ఇపుడు 42రోజులలో సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.మహిళలలు కోసం ఉమెన్ హెల్పు డెస్కు లు ఏర్పాటుచేయుడం జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో 14,500మంది మహిళా పోలీసులు ద్వారా సేవలందిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో సుమారు వెయ్యికోట్లు విలువైన గంజాయిని ద్వంసం చేయుడం జరిగిందని తెలిపారు.98లక్షలమంది మొబైల్‌దిశ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.