ప్రజలుకు జవాబుదారీగా వుండాలి`డిఫ్యూటి సిఎం ధర్మాన
పోలాకి: ప్రజాప్రతినిదులు,అధికార్లు ప్రజలుకు జవాబుదారీగావుండాలని అలాగ వుంటేనా ప్రజలు ఆదరిస్తారని ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాసు అన్నారు.పోలాకిలో మండల సర్వసభ్యసవవేశంలో ఆయన పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు రాజకీయాలు కు అతీతంగా పార్టీలు తారతమ్యంలేకుండా అమలు చేయుడం జరుగుతుందని అది ప్రజలుకు కూడా తెలుసునని అన్నారు.ఎక్కడ అవినీతిలేకుండా కేవలం స్వీచ్ నొక్కితే వారి బ్యాంకు ఖాతాలలోని నగదు చేరే విదంగా రాష్ట్రముఖ్యమంత్రి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ,ప్రతిపక్షాలు దీన్నిజీర్ణించుకోలేక పోతున్నారని,రాబోయే ఎన్నికలలో కూడా వారికి ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు.ప్రభుత్వంతో పాటు అదికార్లు కార్యకర్తలు కూడా ప్రభుత్వ పరిపాలన ప్రజలుకు తెలియుచేయాలని తెలిపారు.