ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ధింపు: ప్రదాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది.భూటాన్ జాతీయ దినోత్సవం సందర్బంగా నడాగ్‌పెల్‌గిఖోర్లో అవార్డు ప్రకటించారు.భారత ప్రదాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రదాని లోటే షేరింగ్ తెలిపారు.సోషల్‌మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని భూటాన్ ప్రదానమంత్రి కార్యాలయంనుండి కూడా ఈ విషయం ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేసింది.భూటాన్ పౌర పురస్కారం అందుకోవడానికి మోదీజీ అర్హుడని ఆ దేశ పిఎంవో తెలిపింది.మోదీజీ హద్దులులేని స్నేహాన్నిప్రదర్శించారని కరోనా వేళలలో కూడా వారు అందించిన సహకారాన్ని మరువలేమని భూటాన్ పిఎం తెలిపారు.