ప్రభుత్వ పధకాలుకు పక్కదోవ పట్టిస్తున్న ఐసిడిఎస్ సూపర్‌వైజర్
శ్రీకాకుళం: ఎలుకు తోక ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్న చందంగా వుంది ఈ ఐసిడిఎస్ సూపర్ వైజర్.గతంలో రణస్దలం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిదిలో చేసి శాఖాపరమైన చర్యలకు గురై ఇపుడు ఆముదాలవలస ప్రాజెక్టులో సూపర్ వైజర్‌గా లీలారాణి జాయిన్ అయింది.జాయిన్ అయినప్పటినుండి వివాదాలుతో అంగన్వాడీ సెంటర్లులో కార్యకర్తలు ,అసభ్యకరంగా మాట్లాడుతుందని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు.కేంద్రాలుకు వెల్లి గతంలో కార్యకర్తలు ఫుడ్ రిపోర్టులో పాడైపోయిన పౌష్టికాహారాన్ని గుర్తించి,అప్పట్లో పౌష్టికాహారాన్ని పక్కనపెట్టారు .కనుమరుగైపోయిన ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చి కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని వాటిని ఫోటోలు సోషల్‌మీడియా లో పోస్టుచేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారు.ప్రభుత్వం పాడైనపోయిన పౌష్టికాహారం ఇస్తుందని ప్రచారం చేస్తుంది.గడప గడపకు వైయస్సార్ సంక్షేమ పధకాలు అంటూ ప్రచారం లో వున్న నాయుకులుకు ఈ వ్యవహారాలు తలనొప్పిగా మారబోతుంది.వచ్చి రెండు నెలలు అయినప్పటికీ సరుబుజ్జిలి ప్రశాంతంగా వున్న సరుబుజ్జిలి సెక్టారుకు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది.దీనిపై గ్రామాలులో అందికీపౌష్టికాహారం అందుతున్నా అందలేదు…ఈ ప్రభుత్వం మాకేమి ఇవ్వడం లేదని ప్రజలుకు చెప్పమని అవగాహన కల్పిస్తుంది.ఇటువంటి అదికార్లుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు,కార్యకర్తలు,అంటున్నారు.ప్రాజెక్టు ఆఫీసర్ మాటను కూడా భేఖాతరు చేస్తూ నేను ఎవరు మాట వినను అంటూ ఇటువంటి ప్రచారానికి తెరతీసింది.ఇప్పటికైనా ఈ సూపర్‌వైజర్ వ్యవహారం స్పీకర్ తమ్మినేని శీతారాం దృష్టికి తీసుకువెలతామని పలువురు అంటున్నారు.