హైదరాబాద్: బాగ్యనగరంలో వినాయక నిమజ్జనం శోభాయాత్రలు ప్రారంభమవడంతో సందడి నెలకుంది.20వేలుకు పైగా వినాయుకుని విగ్రహాలు హుస్సేను సాగర్‌లో నిమజ్జనం జరుగుతున్ననేపధ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.బాగ్యనగరంలో వీదివీదిన వినాయుకుని నిమజ్జనానికి ప్రజలు కదిలారు.నలుమూలాలా వినాయుకుని నామస్మరణతో మారుమ్రోగుతుంది.కోలాటాలు,తీన్మార్ వాయిద్యాలు,భజనలుతో వీదివీదులు భక్తి కీర్తనలు ప్రతిద్వనిస్తున్నాయి.గణపతిబొప్పామోరియా అంటూ గణనాదులు ముందుకు కదులుతున్నాయి.ప్రశాంతంగా శోభాయాత్ర కొనసాగుతుంది.