బాధిత కుటుంబానికి 21లక్షల ప్రమాద భీమా చెక్కును అందచేసిన ఎస్పీ
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానకిప్రమాద భీమా చెక్కును జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక అందచేశారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎస్ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వంనుండి మంజూరైన గ్రూప్ పర్సనల్ ప్రమాద భీమాఇన్సూరెన్సు 21,15000ఆయన సతీమణి ఎస్ లలితకు ఎస్పీ అందచేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మల్లేశ్వరరావు కానిస్టేబుల్ ప్రమాదంలో మరణించడం చాలా భాదకరమైన విషమని పోలీసు శాఖకు తీరని లోటు అని అన్నారు.వారి కుటుంబానికి పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా వుంటుందని అన్నారు.