బిసిలు పక్షపాతి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం
శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతి పేద మద్యతరగతి కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం వైయస్సాఆర్ కాంగ్రేస్ ప్రభుత్వమని వైయస్సాఆర్ కాంగ్రేస్ పార్టీ యువనాయుకులు తమ్మినేని చిరంజీవి నాగ్ (నాని) అన్నారు.రాష్ట్రప్రభుత్వం బిసిలు పక్షపాతిగా అన్ని కులాలుకు న్యాయం చేసేవిదంగా పరిపాలన అందిస్తుంటే దీన్ని చూసి ప్రతిపక్షనాయుకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.ప్రజలుకు అన్ని సంక్షేమ పధకాలు అందించాం కాబట్టి నేడు ప్రజలులోకి వెల్లి ఇంటింటా వైయస్సాఆర్ నాయుకులు నేరుగా ప్రజలుకు కలుసుకోగలుగుతున్నారని అన్నారు.బిసిలు పక్షపాతిగా రాష్ట్రప్రజలు గుండెలలో చోటు సంపాదించుకున్న గొప్పనాయుకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని అన్నారు.సామాజిక న్యాయభేరి పేరున బస్సుయాత్ర జరుగుతుందని ప్రజలు ప్రభుత్వ పధకాలు పూర్తిస్దాయిలో అందుతున్నాయా లేదా అన్నదే ఈ యాత్ర ప్రదాన ఉద్దేశ్యమని,అంతేకాకుండా ప్రజలుతో మమేకం అయ్యేందుకు ఈ యాత్ర ఎంతో దోహదపడుతుందని అన్నారు.