బైరి లో రక్తదాన శిబిరం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బైరి గ్రామంలో రక్తదాన శిబిరం విశేష స్పందన లభించింది. యువత ముందుకు వచ్చి రక్త దానం చేయడం తో రక్తదాన శిబిరం విజయవంతమైంది. 50 మంది యువతీ యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహించడం వల్ల యువతికి అవగాహన కలుగుతుందని రక్తం కొరత ఈ విధంగా అధిగమించవచ్చునని రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటువంటి రక్తదాన శిబిరాలు గ్రామీణ ప్రాంతాలు నిర్వహించడం అరుదని గ్రామీణ ప్రాంత యువతీ యువకులు ముందుకు వచ్చి ఇటువంటి రక్తదాన శిబిరం నిర్వహించాలని రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. బైరి గ్రామంలోని శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం వద్ద ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు గ్రామ పెద్దలు ఆలయ నిర్వాహకులు లీలామోహన్, పలు రాజకీయ నాయకులు యువతీ యువకులు పాల్గొన్నారు.