బ్రహ్మ ముహుర్తం అంటే ఏమిటి…?
బ్రహ్మా ముహుర్తం చాలా విలువైనది.పూర్వం కాలంలో ఘడియలు లెక్కించేవారు.ఒక పగలు రాత్రి కలిపి అహారాత్రిం అంటారు.ఒక అహారాత్రికి 30మహుర్తాలు వుంటాయి.సూర్యోదయం ముందు వచ్చే మహుర్తామే భ్రహ్మాముర్తాంగా నిర్ణయించారు.ఈ ముహుర్తానికి అదిపతి బ్రహ్మా.సూర్యోదయం అవడానికి 98`48నిముషాలు మద్యకాలం ఇది. అసలు ఈ బ్రహ్మాముహుర్తానికి ఈ పేరు ఎందుకు వచ్చింది.కశ్యపుబ్రహ్మాకు ,వినతకు జన్బించినవాడు అనూరుడు.ఈయన గరుత్ముంతుడుకు సోదరుడు.ఇంకా అనూరుడు సూర్యునికి రధసారది,ఒక సమయంలో తల్లి వినత పుత్రునికిచూసుకోవాలని కుతూహలంతో అండం పగలగోట్టింది.అప్పుడు అనూరుడు సగం శరీరంతో జన్మించాడు.బ్రహ్మాఅతన్ని సూర్యుని సారధిగా నియమించి,నీవు భూలోకానికి మొదటిగా కనిపించిన కాలమునే బ్రహ్మాకాలం బ్రహ్మాముహుర్తాంగా అంటారు.
ఈ సమయంలో ఏ నక్షత్రాలు గాని గ్రహాలుకాని చెడు చేయులేవు అని అనూరునికి వరమిచ్చాడు,అందుకే బ్రహ్ముమహుర్తాకాలంలో అన్నీ శుబాలు కలుగుతాయి.ఈ సమయంలో ఎక్కువగా శుభకార్యాలు చేస్తారు.ఆద్యాత్మిక చింతన విలువైన సమయం.ఈ సమయంలో ద్యానం,ఆసనాలు,ఓంకారం చేస్తే మంచిదని శాస్త్రం చెబుతుంది.