భారతదేశంలో ఆంద్రప్రదేశ్ అగ్రగామి కానుంది
శ్రీకాకుళం: భారతదేశంలోనే ఆంద్రప్రదేశ్ అగ్రగామికానుందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.విశాఖపట్నంలో జరిగిన రెండురోజులు సమ్మోట్ విజయవంతం అయిందని పరిశ్రమ దిగ్గజాలు రాష్ట్రానికి రావడం ఎంతో శుభపరిణామమని అన్నారు.పరిశ్రమలు రాష్ట్రానికి రావాలి అనే కలలు నేడు నిజమైనాయని13లక్షలు కోట్లు ,378ఒప్పందాలు జరిగాయని ఇది గొప్ప విషయమని అన్నారు.రాష్ట్రంలో జరిగే పరిణామాలు,అభివృద్ది నాయకత్వంపై నమ్మకం ,వుంటేనా ఇలా జరుగుతుందని ఇది నేడు నిజంచేసారు రాష్ట్రముఖ్యమంత్రి అని అన్నారు.ఈ సమ్మెట్‌లో పాల్గోనేందుకు 25దేశాలునుండి పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారని తెలిపారు.నీతి అయెగ్‌లో రాష్ట్ర అభివృద్ది చూపుతున్నారని తప్పుడు రాతలు రాయించి రాష్ట్రఅబివృద్దిని ఆపలేరని తెలిపారు.