భాషా వైతాళికుడు `గిడుగు

0
617
8television

భాషా వైతాళికుడు `గిడుగు
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న వీర్రాజు ,వెంకటమ్మ దంపతులుకు గిడుగు వెంకట రామమ్మూర్తి జన్మించారు .హైస్కూలు చరిత్ర పాఠం చెప్పిన రోజులలో ముఖలింగం దేవాలయం శాసనాలు లిపిని చదివి అర్దం చేసుకోవడంమే గాక ,పరిశోధన చేసి గాంగవంశీయులు గురించివ్యాసాలు రాశారు.తెలుగు బాషా బోధనలను వ్యవహారం చేయాలన్న ఆయన ఆలోచన కు 1907లో స్కూలు ఇన్‌స్పెక్టరు జెఏ యేట్సు అనే ఆంగ్లేయడు మద్దతు పలికాడు.శ్రీనివాస్‌ అయ్యంగార్‌,గురజాడ అప్పారావు,యేట్సు,గిడుగు కలిసి వ్యవాహారకబాషలో భోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు.ఇందుకోసం గిడుగు తన సంపాదన కత్వంలో తెలుగు అనే పత్రికను ప్రారంబించారు.వీరి కృషి ఫలితంగా 1912`13లో స్కూలు ఫైనల్‌ బోర్డు తెలుగు వ్యాస పరిక్షకు గద్యం లేదా వ్యవహారిక భాషలో రాయవచ్చునని ఆదేశాలు జారీ చేశారు.ఉత్తరాంద్ర అడవులలో సవర తెగ బాష నేర్చుకుని సవర బాష పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూలు పెట్టి అద్యాపకులకుజీతాలు చెల్లించి ఆ బాషను వారు చదువుకునే ఏర్పాట్లు చేశారు.మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారు చేసిన సవరబాష వ్యాకరణాన్ని 1931లో ,సవర ఇంగ్లీసు పదకోశాన్ని 1938లో అచ్చువేశారు.గిరిజనులు అంటరానివారు అని అప్పటి సంఘం అంటుంటే సవర విద్యార్దులను తన ఇంట్లో బస ఏర్పాటు చేసి బోజనం పెట్టి అభ్యుదయ వాదిగాపేరు సంపాదించారు.పర్లాఖిముడలో ఎక్కువ కాలం గడిపిన గిడుగు రామ్మూర్తి ఆ ప్రాంతం ఆంద్రరాష్ట్రంలో చేర్పించిందేకు కృషిచేశారు.అయినప్పటికీ ఫలతం లేకపోవడంతో పర్లాఖిముడి వదిలి రాజమండ్రిలో కొంత కాలం నివసించారు.1934లో ప్రభుత్వం కైజర్‌`ఏ`హింద్‌ బిరుదు ఇచ్చి సత్కరించింది.1936లో సవర బాషా ఉద్యమానికి గిడుగు కృషికి మద్రాసు ప్రభుత్వంరావ్‌ బహుదూర్‌ బిరుదు ఇచ్చిసత్కరించింది.1938లో ఆంద్రవిశ్వకళాపరిషత్‌ ప్రపూర్ణ బిరుదు కు ఎంపిక అయ్యారు. తెలుగు బాషకోసం ,సవరులు బతుకులుకోసం ,ఉత్తరాంద్ర ఉనికి కోసం శ్రమించిన గిడుగు వెంకరామమ్మూర్తి 1940 జనవరి 22న మద్రాసులో కన్నుమూశారు.గిడుగు రామమ్మూర్తి ఆదినుండి తెలుగుబాషకు చేసిన సేవలుకు గుర్తింపుగా ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వం అదికార బాషా సంఘంవారు ఆయన జయంతి ఆగస్టు29న తెలుగు బాషా వికాస దినోత్సవంగా ప్రతియేటా అధికారికంగా నిర్వహిస్తున్నారు.నేడు విగ్రహావిష్కరణ
శ్రీకాకుళ జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాలపేటలో గిడుగు వెంకటరామమ్మూర్తి గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది.(23ఆగస్టు2021) ఈ కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని శీతారాం పాల్గోంటున్నారు.ఆంద్రప్రదేశ్‌ విద్యాసంచాలకులు వాడ్రేవు చిన వీర భద్రుడు ,జిల్లా కలెక్టరు శ్రీకేష్‌బిలాఠకర్‌ ,జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌ ,పాల్గోంటున్నారు.విగ్రహావిష్కకరణ విగ్రహదాతలు బెవర మల్లేశ్వరరావు,కె.వి.జి.సత్యన్నారాయణ,సురవరపు నాగేశ్వరరావు, స్దల దాత చిన్నాల కిత్తయ్య కుటుంబసభ్యులు కేటాయించారు.
టూరిజం స్పాట్‌గా పర్వతాలుపేట
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాలుపేటలో గిడుగు వెంకటరామమ్మూర్తి విగ్రహావిష్కరణ జరగడంతో ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలలో ఈ ప్రాంతం కూడా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.ఇంతటి మహాన్నత వ్యక్తి జన్మించిన ఈప్రాంతం టూరిజం స్పాట్‌ గా ఏర్పాటుచేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here