భూ అక్రమదారులుపై చర్యలు తీసుకొండి
శ్రీకాకుళం: విలువైన భూములుపై అక్రమార్కులు ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి.ఎటువంటి డాక్యుమొంటు లేకుండా అప్పనంగా కోట్లు రూపాయిలు విలువైన భూములును కాజేయాలన్న అక్రమదారులు గుట్టు రట్టుయింది.సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.వివరాలులోకి వెలితే..శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాతపట్నం మండల కేంద్రంలోని రెవెన్యూ సర్వేనెంబరు 261`5 లో ఎ.1.10సెంట్లు భూమి అగతముడి శ్రీలక్షి పేరున డాక్యుమొంటు పొందియున్నారు.అయినప్పటికీ కొంతమంది భూఅక్రమదారులు ఈ భూమిపై కన్నెసి కాజేయాలని పావులు కదిపారు.మండల తహశీల్దారు కాళీప్రసాదరావు కరోనా సమయంలో కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్సనిమిత్తం సెలవు పెట్టడంతో ఇన్‌చార్జు తహశీల్దారుగా పదివీ బాద్యతలు తీసుకున్న నాగభూషణరావు అక్రమదారులు శాసనపురి బాజ్జీ,మాడుగులు లక్ష్మణరావు,దేవరశెట్టి బాస్కరరావు,శాసనపురి కోటీశ్వరరావు,ఎండపాటి అప్పన్నతో ములాఖత్ అయి రికార్డులు తారుమారు చేసి 2020లో రోషనల్ ఖాతా నెంబర్లు ను రికార్డులోకి ఎక్కించి వారికి అప్పనంగా భూమి దారాదత్తం చేయాలని చడిచప్పుడు కాకుండా పనిపూర్తిచేయుడం జరిగింది.విషయం తెలుసుకున్న అగతముడి శ్రీలక్షి జూలై 24న పాలకొండ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కోర్టుకి ఆశ్రయించారు.నకిలీ డాక్కుమొంట్లు 1బి,అడంగల్ తో వీరు, అదికార్లును కూడా మాయచేయంతో అసలు భూ యజమానిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఆర్డీవో కోర్టులో కూడా న్యాయం జరగదని శ్రీలక్ష్మి జిల్లా జాయింట్ కలెక్టరును ఆశ్రయించారు.అన్యాయమైన నాకు న్యాయం చేయాలని కోరారు.తప్పుడు డాక్యుమొంట్లు మంజూరుచేసిన అదికారిపై దర్యాప్తుచేయాలని,భూఅక్రమణ కు పాల్పడి న వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టరును కోరామన్నారు.