మంచు బీభత్సం..40డిగ్రీలు మైనస్
అమోరికా ,కెనడాలో మంచుతుఫాను బీభత్సం సృష్టిస్తుంది.మూడు రోజలు గడుస్తున్నా మంచు తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.ఇప్పటికే 16వేలుకు పైగా విమాన సర్వీసులు రద్దుయ్యయి.మంచు రోడ్డుపై దట్టంగా వుండడంతో ఎక్కడికక్కడే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ బాంబ్ సైక్లాన్‌లో తెలుగుదంపతులు మరణించారు.న్యూజెర్సీలోని ఐస్‌లేక్ వద్ద నారాయణ ,హరిత దంపతులు మృతి చెందారు.
ప్రాణాలుతో పిల్లలు ఇద్దరూ భయటపడ్డారు.మృతులు స్వస్దలం గుంటూరు జిల్లా పాలపర్రు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు,తుఫాను ప్రభావంతో ఇప్పటివరకూ 60మంది పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది.20కోట్లు మందికి పైగా ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు.ప్రదాన నగరాలు అన్ని గడ్డకట్టుపోతున్నాయి.ప్రసుత్త ఉష్ణోగ్రత 40డిగ్రీలు మైనస్‌కు చేరిపోవడంతో పరిస్దితి ఎంత దయనీయంగా వుందో తెలుస్తుంది.