మట్టిలో మాణిక్యం
అనంతపురం: చదువు కు పేదరికం అడ్డురాదు.కృషి పట్టుదలవుంటే దేన్నియినా సాధించవచ్చు.కూలీపనిచేసుకునే ఆకుటుంబంలో ఏకంగా పిహెచ్‌డి పట్టా సాధించి అందరి మన్ననలు అందుకుంది ఆ మహిళ.ఈ మట్టిలో మాణిక్యం ను చూసి అందరూ విస్తుపోయారు.అనంతపురం జిల్లా లోని శ్రీకృష్ణదేవరాయులు విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.విశ్వవిద్యాలయమంతా సర్వాంగసుందరంగా అలంకరించారు.విఐపి లు తాకిడితో హడావుడిగా వుంది.ఈ ఉత్సవాలలో పిహెచ్‌డి పట్టాలు ప్రదానం చేసేందుకు రాష్ట్ర గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిధిగా హాజరయ్యారు.ఒక్కరినీ వేదికకు పిలుస్తున్నారు.అంతలోనే సాకే భారతి అనే పిలుపు విన్పించింది.ఈ పిలుపుతో అందరూ ఎదురుచూస్తున్నారు.పిహెచ్‌డి పట్టా అందుకునేందుకు మోడరన్ డ్రెస్‌తో అందంగా తయారై వేదికపైకి వస్తుందనుకున్నారు.కాని అందరూ అవాక్కుయ్యారు.భారతి ఓ సాదారణ కూలీ కుటుంబం .అరిగిపోయిన హవాయి చెప్పులు,ఓ సాదా చీరతో తన భర్త,కూతురుతో పిహెచ్‌డి పట్టా అందుకునేందుకు వేదికపైకి చేరుకుంది.పెద్దరు ,అతిదిలు,ప్రముఖులు అందరూ ఆశ్యర్యచకుతులైనారు.పేదరికం లక్ష్యసాధనకు అడ్డుకాదని ,ఆ చదువులు సరస్వతిచూస్తూ,ఒకవైపు పేదరికం,మరో వైపు కుటుంబభారం,పిల్ల భాద్యత ఇవన్నీ అదిగమించి ఆ పట్టా అందుకుంటున్న మధుర క్షణాలు అందరినీ అబ్బురపరిచాయి.ఆమో చిరునవ్వు,ను అప్రయత్నంగావున్న చేతులు చప్పట్లు రూపంలో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది,గవర్నలు చేతులు మీదుగా పిహెచ్‌డి పట్టా ఆమె చేతుకి అందుకుంది.ఇది కదా మట్టిలో మాణిక్యాలు.