మద్యం మత్తులో విద్యార్దులు..కఠినచర్యలు తీసుకున్న హెడ్‌మాస్టారు
కర్నాలు: కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వఉన్నత పాఠశాలలో 8వతరగతి,9వతరగతి చదువుతున్న 5గురు విద్యార్దులను ప్రతిరోజు మద్యంసేవించి తరగతులు కు హాజరవుతుండడం కలకలం రేపింది.ఈ విషయం తెలుసుకున్న ప్రదానోపాద్యాయులు వారి తల్లిదండ్రులును పిలిపించి టిసి ఇచ్చి స్కూలు పంపంచే సంఘటన పెద్ద చర్చాంశనీయమైంది.ఇటువంటి విద్యార్దులు పాఠశాలలో వుండడం మిగతా విద్యార్దులు చెడిపోతారని అందువల్ల కఠిన చర్యలు తీసుకున్నామని ప్రదానోపాద్యాయులు అన్నారు.చిన్నతనం ఇటువంటి చెడు అలవాట్లుకు గురికావడం వారికి చాలా భాదకరమైన విషయం.ఇప్పటికైనా తల్లిదండ్రులు వారిపై నిఘావుంచి సరైన మార్గంలో వుంచాలని పలువురు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నరు.