మహాన్నత వ్యక్తి గాందీ …ఆయన జీవన ప్రయాణం`2
ఓతాగాంధీ బార్య చనిపోయిన తరువాత రెండోపెండి చేసుకున్నాడు.మొదటి భార్యకు నలుగురు కొడుకులు,రెండోభార్యకు ఇద్దరు కొడుకులు,ఆ ఆరుగురు అన్నదమ్ములలో అయిదవవాడు కరంచంద్ గాంధీ,ఆయనకు కబాగాంధీ అనికూడా మరో పేరు వుంది.ఆరవ వాడు తులసీగాంధీ ,ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు పోరుబందు కు దివానులుగా పనిచేశారు.కబాగాంధీ తండ్రి పోరుబందరు ప్రాదానామాత్య పదవికి త్వజించి తరువాత ఆయన స్దానిక కోర్టులో సభ్యునిగా పనిచేశారు.తరువాత రాజకోట దివానుగా ఆ తరువాత బికానేరుకు దివానుగా పనిచేశారు.యావజ్జీవితం రాజకోట సంస్దానంలో ఫించను పుచ్చుకున్నారు.కబాగాందీ నాలుగు పెళ్లిల్లు జరిగాయి.మొదటి భార్యకు ,రెండోభార్యకు ఇద్దరు కూతుల్లు పుట్టారు.నాలుగో భార్యకు పుత్తలీబాయి.ఆమెకు ఒక కుమార్తె ,ముగ్గురు కుమారులువారిలో చివరి వాడు గాందీ,తండ్రి లంచగొండుగాని,ఇంటాబయటా కూడా పక్షపాతగాగాని లేకుండా వ్యవహారించే వ్యక్తి గా మంచి పేరు తెచ్చారు.గాంధీ తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు.అందువల్ల ఆస్తి తక్కువ,తండ్రి చదివించి స్దోమత లేకపోవడంతో అయిదవ అయిదవ తరగతి వరకూ చదవడం జరిగింది.మత సంబందమైన పరిచయాలు గాందీ తండ్రి గారికి తక్కువ దేవాలయాలు దర్శించడం,దర్మపరిజ్ఞానం ఎక్కువ సంపాదించుకున్నారు.ఒక బ్రహ్మాణుని ప్రేరణతో గీతాపారాయనం ప్రారంబించారుప్రతిరోజూ శ్లోకాలు పఠిస్తూ వుండేవారు.తల్లి పరమసాద్వి,గాందీ గారి చిన్నతనం నుండే తల్లి మనసు హృదయంలో విషయం నాటుకుంది.ఆమెకు దైవచింతన ఎక్కువ ప్రతిరోజూ పూజలు నిర్వహించేది.పూజచేయుకుండా భోజనం చేసేది కాదు.వైఫ్ణవదేవాలయం ప్రతిరోజూ వెల్లి రావడం ఆమెకు నిత్యం పరిపాటిగా మారిపోయింది.ఆమె చాతుర్మాస వ్రతం చాలా దీక్షతో చేసేది.