మహాన్నత వ్యక్తి గాంధీ ఆయన జీవన ప్రయాణం`3
బాల్యవివాహం
గాంధీకి పదమూడో యేట పెండ్లి అయింది.కాఠియావడ్‌లో వివాహం అంటే ప్రదానం కాదు .ఇద్దరు బాలబాలికలు పెండ్లి జరపాలని వాళ్ళుతల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని ప్రదానం అంటారు.పూర్వం పెండ్లి బాలుడు చెనిపోయినా బాలిక వితంతువు కాదు.అయితే గాందీకి మాత్రం మూడు ప్రదానాలు అయ్యాయి.ప్రదానం జరిగిన తరువాత ఇద్దరు బాలికలు చెనిపోయారన్న విషయం గాందీకి తెలియుదు.గాందీకి ఇద్దరు అన్నదమ్ములు.అయితే ముగ్గురికి ఒకేసారి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు.ఆరోజులలో పెండ్లి ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసేవారు.అయితే ఒకడు మాత్రం పెండ్లికి అంగీకరించకపోతే గాందీ తో పాటు మరో అన్నదమ్ముడు పెండ్లికి ఒప్పుకోవడంతో పెండ్లి ఏర్పాట్లు జరిపోయాయి.రాజకోటనుండి పోరుబందురకు పెండ్లి కూమారులుగా అలంకరించి తీసుకువెల్లారు.రాజకోటనుండి పోరుబందరుకు ఐదురోజులు ప్రయాణం ఈ ప్రయాణంలో చివరిమజీలీవద్ద గుర్రపు బగ్గీ బోర్లాపడిరది.గాందీ తండ్రి గారికి గట్టి దెబ్బలు తగిలినా ఈ అవకాశం రాదని పెండ్లి జరిపారు.ఈ విదంగా బాల్యంలో గాందీకి వివాహం అయ్యింది.కాలక్రమేణా వదినవద్ద దంపతులు ఎలా వుండాలి అనేవిషయం నేర్చుకున్నారు.ఈ విదంగా బాల్యవివాహాం గాందీకి జరిగిపోయింది.