మాతృప్రేమను మరువలేం..
శ్రీకాకుళం: అమ్మ అనే పదానికి వెలకట్టలేం.తల్లిప్రేమకు అంతులేని అభిమానం..నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి సమాజంలో తనకుంటూ ఒక స్దానాన్ని ఇచ్చే అమ్మ కనిపించే దైవం.అటువంటి అమ్మ ప్రేమను అమ్మ జ్ఞాపకాలు ను తన మదిలో వుంచుకుని అమ్మకోసం పరితపించే పుత్రులు కొందరే అటువంటి వారు తల్లి కోసం ఏదో చేయాలని తల్లి ప్రేమను ఏవిదంగానైనా తన జ్ఞాపకాలు నుండి చూసుకోవాలని కలలు కంటుంటారు.అటువంటి ఓ కన్నకొడుకు తన మాతృమూర్తి ప్రేమను పంచుకున్నారు.శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మాం గ్రామంలో తన తల్లిఉయ్యాల అప్పాయమ్మ 13వ వర్దంతిని పురస్కరించుకుని మోగా వైద్యశిభిరం నిర్వహించారు.లైఫ్ హాస్పిటల్ సౌజన్యంతో డాక్టరు సనపల చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరం విజయవంతగా నిర్వహించారు.ఈ సందర్బంగా అమ్మడాబా ఉయ్యాల కృష్ణ మాట్లాడుతూ అమ్మ జ్ఞాపకాలు పదిలమని,తల్లి సర్వస్వం అంటూ బ్రతుకుతున్నామని తల్లి కోసంఎదో చేయాలని తపనతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు.
డాక్టరు సనపల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇటువంటి బిడ్డలు కొంతమందికి మాత్రమేవుంటారని తల్లి కోసం నిత్యం పరితపించేవారు కొందరే వుంటారనిఅటువంటి వ్యక్తిలలో కృష్ణ ఒకడని తల్లి వర్దంతి సందర్బంగా ఎదో చేయాలని అన్నారని కాని ప్రజలు ఆరోగ్యముఖ్యమని అందువల్ల అందరికీ గుర్తిండిపోయేది వైద్యం మాత్రమే నని కావున వైద్యశిబిరం నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ వైద్య శిబిరానికి అదిక సంఖ్యలో ప్రజలు పాల్గోన్నారు.