మీడియా గొంతు నొక్కడం ఎవరికీ సాధ్యం కాదు
శ్రీకాకుళం: బీబీసి సంస్దపై ఒక పధకం ప్రకారం కేంద్రప్రభుత్వం ప్రమేయంతో ఆదాయ పన్ను శాఖ స్వేచ్చను హరించే చర్యను మానుకోవాలని శ్రీకాకుళం జిల్లా జర్నలిస్టు సంఘాలు నాయుకులు డిమాండ్ చేశారు.ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్దపై ఐటి దాడులుచేయుడం ప్రజాస్వామ్యవ్యవస్దలో గొంతునొక్కడమే నని అన్నారు.బీబీసి దాడులు మీడియా స్వేచ్చను హరించడమే అని దీన్ని నియత్రంచడం ఎవరికీ లేదని అందువల్ల నిస్వార్దంగా కధనాలు ప్రచురిస్తే తప్పేంటిని వారు ప్రశ్నించారు.ఇటువంటి తప్పుడు ఆలోచనలుతో మీడియాను నొక్కేయాలనే ఆలోచనవచ్చే ఏ నాయుకులు గాని ఏ పార్టీగారి ప్రజాస్వామ్యంలో నిలబడలేరని వారు అన్నారు.ఇప్పటికైనా ఇటువంటి దాడులు ఆపకపోతే దేశవ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్లుక్కి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని వారు అన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో వివిద సంఘాలు జర్నలిస్టుల నాయుకులు శాసపు జోగినాయుడు,కొంక్యాన వేణు,డోల అప్పన్న, సత్తారు బాస్కరరావు,టెంక శ్రీను,తిత్తి ప్రవీణ్,ఎస్‌వి రమణ,వాసు,శ్రీనువాసరావు,క్రిష్ణ,వేణు,బీమారావు,ఇందిరాప్రసాద్,తదితరులు పాల్గోన్నారు.