మేనెలలో తిరుమల తిరుపతి దేవస్దానం ఉత్సవాలుకేలండర్ విడుదల
తిరుపతి: మేనెలలో తిరుమల తిరుపతి దేవస్దానంలో నిర్వహించే ఉత్సవాలును తిరుమల తిరుపతి దేవస్దానం ప్రజాసంబందాల అధికారి విడుదల చేశారు.మే1.సర్వఏకాదశి,శ్రీపద్మావతిఅమ్మవారు శ్రీనివాసుని పరిణయెత్సవంసమాప్తి, మే4.నృసింహా జయంతి,మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి,అనంతాళ్వార్‌ల శాత్తుమొర,మే 5.పౌర్ణమి గరుడసేవ,కూర్మజయంతి,మే6.అన్నమయ్యజయంతి,మే7.పరాశర భట్టర్ వర్ష తిరునక్షత్రం మే14.హనుమాన్ జయంతి,మే 24 నమ్మాళ్వర్ ఉత్సవారంభం,మే 28 శ్రీభోగ శ్రీనువాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాబిషేకం,మే30.శ్రీవరదారాజస్వామి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.