రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్దాపితం
శ్రీకాకుళం: రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్దాపితం అవుతుందని సర్వేలన్నీ వైయస్సాఆర్ పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తుందని తెలుపుతున్నా ఇంకా ఇదేం ఖర్మరా బాబు అంటూ తెలుగుదేశం నాయుకులు తిరుగుతుండడం విడ్డూరంగా వుందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి తమ్మినేని శీతారాం అన్నారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని ,జనం గుండెలలో ఎప్పుడో జగన్ కలిసిపోయారని ఓడిరచడం ఎవరిసాద్యం కాదని అన్నారు.ప్రజలు తెలివితక్కువ వారు కాదని సంక్షేమ పాలన అందించేవారిని ఎన్నుకుంటారు తప్ప దోపడీ చేసేవారిని ఎన్నుకుంటారా అని అన్నారు.గ్రామాలలో ప్రజలు బ్రహ్మారధం పడుతున్నారని,మళ్లీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని,అందువల్ల తెలుగుదేశం పార్టీనాయుకులు పగటి కలలు మానుకోవాలని తెలిపారు.వైయస్సాఆర్ పార్టీని ఓడిరచాలని తెలుగుదేశం పార్టీ నాయుకులు జనసేన,బిజేపి,ఏ పార్టీ పడితే ఆ పార్టీకి వెల్లి బ్రతిమిలాడుతున్నారని ,ఎన్ని కుట్రలు కుంతంత్రాలుచేసినా గెలిచే పరిస్దితి లేదని అన్నారు.