శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియెజకవర్గంలో రాష్ట్రఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాసు పలు శంఖుస్దాపనలు,ప్రారంభోత్సవాలు నిర్వహించారు.మండలంలోని గోపాలపెంటలో 21.80లక్షలుతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని 17.50లక్షలతో నిర్మించిన డాక్టరు వైయస్సార్ ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించారు.లుకలాం నుండి కొమనాపల్లి వరకు నిర్మించినున్న ఆర్‌ఆండ్‌బి రహదారికి నర్సింగనాయుడు పేటలో మంత్రి శంకుస్దాపన కార్యక్రమం నిర్వహించారు.కామేశ్వరిపేట ఎల్‌కేరోడ్డు నుండి 1.50కోట్లుతో మరమ్మత్తులు పనులకు శంఖుస్దాపన కార్యక్రమం నిర్వహించారు.