టుడే స్పెషల్
రూపాయి నోటు ఆవిర్బవించి నేటికి 104 సంవత్సరాలు
భారతదేశంలో రూపాయి నోటు ఆవిర్బవించి నేటికి 104 సంవత్సరాలు అయ్యంది.తొలి రూపాయి నోటు నవంబరు 30,1917లో కింగ్‌జార్జీ5 వ చక్రవర్తి ఉన్నప్పుడు ఈ నోటు చెలామణిలోకి వచ్చింది.అయితే అప్పటి రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రారంబంకాకపోవడంతో కేవలం గవర్నమొంటు ఆఫ్ ఇండియా పేరున ఈ నోటు వాడుకలోకి వచ్చింది.మొదటి ప్రపంచ యుద్దంలో నాణెలలో ముద్రించడం,టంకశాలలకు కష్టం కావడంతో మళ్లీ కరెన్సీ వైపే మొగ్గు చూపించారు.1940లో నోట్లు ముద్రించడం మళ్లీ ప్రారంబించారు.స్వాతంత్య్రం వచ్చాక 1994లో నోట్లు ముద్రణ ఆపేశారు.తిరిగి 2015లో ముద్రించడం ప్రారంభించారు.రూపాయి నోటుకు ఒక ప్రత్యేకత వుంది.నోటుపై ఆర్బీఐ గవర్నరు సంతకం వుండదు.కేవలం ఆర్దిక శాఖా కార్యదర్శి సంతకం వుంటుంది.ఈ విదంగా రూపాయినోట్లు అనేక డిజైన్లుతో ఇప్పుడు పలుమార్లు మార్పులుతో చెలామణికి నోచుకుంటుంది.