రైతులకు మరింత చేరువగా వుండాలి`మంత్రి అప్పలరాజు
శ్రీకాకుళం: రైతులకు మరింత చేరువగా వుండాలని ,రైతులకు అన్నివిధాలా సూచనలు సలహాలు ఇచ్చి వారి అభివృద్దికి మరింత ఊతమివ్వాలని రాష్ట్ర పారిపరిశ్రమ,పశుసంవర్దక శాఖామంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ అదికార్లు ,రైతులకు అందుబాటులోవుండాలని,రైతు భరోసా కేంద్రాలకు త్వరలో ఫ్రిజ్‌లు పంపిస్తున్నామని తెలిపారు.పశుసంజీవిని కార్యక్రమాలు డివిజనల్ స్దాయిలో నిర్వహించాలని,ఖాళీగావున్న పోస్టులు త్వరలో భర్తీకి కసరత్తు జరగుతుందని తెలిపారు.