రైల్వేజోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం`రైల్వేమంత్రి
న్యూడిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రదాన కార్యాలయం కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తామని రైల్వేశాఖామంత్రి అశ్వినీ వైష్ణవి హామీఇచ్చారు.వైయస్పాసిపీపార్లమొంటు పార్టీ నాయుకులు విజయసాయిరెడ్డి,లోక్‌సబాపక్షనాయుకులు మిధున్‌రెడ్డి పార్లమొంటు లో మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తారైల్వేజోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలు ప్రారంభించడం లేదని జరుగుతున్న జాప్యాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై స్పందించి వెంటనే విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.