లక్ష్మితో పాటు గణపతిని కూడా ఎందుకు పూజించాలి…
లక్ష్మితో పాటు మహావిష్ణువును పూజించాలి కాని గణపతిని ఎందుకు పూజించాలి అనేది చాలా మంది ప్రశ్న.లక్ష్మి ప్రసన్నమై జాతకుడు ధనవంతుడైతే ,ధనవంతుడైనా వివేకశూన్యుడు కాకుండా వుండాలి అందుకే గణపతి ని పూజించాలి.దీనికి సంబందించి చాలా కధలు వెలుగులోకి వచ్చాయి.అయితే ఒక రాజు కట్టెలు కొట్టుకుని జీవించే వ్యక్తి చందనం వృక్షాలు ఎక్కువగావున్న అడవిని బహుమతిగా ఇచ్చాడు.అయితే చందనం విలువ తెలియక ఆ వ్యక్తి ఆ కట్టెలుతో పొయ్యివెలిగించి వంటచేసుకునేవాడు.అందువల్ల పేదరికంతో అలాగే వుండిపోయాడు.అందువల్ల బుద్దిలేనివారికి లక్ష్మి కటాక్షం వచ్చినా సుఖం లేకపోవడంతో లక్ష్మితో పాటు గణపతి పూజించాలని శాస్త్రం చెబుతుంది.మరోక కధకూడా విన్పిస్తుంది.ఒక సాధువు ముసలి తనంలో ఒక కోరిక వుండేది.రాజబోగాలు అనుభవించాలని,లక్ష్మిదేవి గురించి కఠోరమైన తపస్సుచేశాడు.లక్ష్మి ప్రత్యక్షమై వరం ఇచ్చింది.రేపు ఉదయంనుండీ నీకు రాజభోగం మొదలవుతుందని చెప్పి అంతర్దానమైపోయింది.ఆ ముసలవాడు రాజదర్బారులోకి ప్రవేశించి లక్ష్మిదేవి వరం ఇచ్చిందికదా అని రాజుని ఒక లెంపకాయ కొట్టి అతని కిరీటం కింద పడేశాడు.ఈ సంఘటనతో రాజు దర్బారులో వున్న ప్రజలు కోపంతో ఊగిపోయారు.ఇంతలో ఆ కిరీటంలోనుండి ఒక విషనాగు బయటకు వచ్చి అక్కడనుండి వెల్లిపోయింది.తనకి మంచి చేసిన ఆ ముసలివానికి రాజు చేశారు.అక్కడనుండి రాజు గా రాజబోగాలు పొంది రాజకోటలోవున్న వినాయుకుని విగ్రహం తొలిగించాడు.దీనితో వినాయుకుని కోసం ముసలివానికి రాజరికం పోయి జైలు కు వెల్లిపోయాడు.అపుడు లక్ష్మిదేవి కలలో కన్పించి.నీకు లక్ష్మి కటాక్షం వున్నా బుది లేదు కాబట్టి నీకు ఈ గతి పట్టిందని వెంటనే వినాయుకుని విగ్రహం ఏర్పాటుచేసి పూజలు చేసినట్టుయితే పూర్వవైభవం వస్తుందని తెలిపింది.దీనితో ముసలివాడు వినాయుకుని విగ్రహం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు.అప్పటినుండి లక్ష్మి,వినాయుకునికి పూజలు చేస్తున్నారు.