లక్ష్మి అనుగ్రహం ఎలా …పొందాలి…
అధినేత్రి లక్ష్మిదేవి అనుగ్రహం లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడుగా జీవించవలసిందే..ఆ చల్లని తల్లి దీవెనలు వుంటే అనుగ్రహం కలిగితే అక్షరం ముక్కరాని వాడు కూడా అష్టెశ్వర్యాలు అనుభవిస్తాడు.ఆమో ఇష్టాఇష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు
1.గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలు విడవరాదు,గుమ్మాన్ని పాదంతో తొక్కి ఇంటిలోకి రాకూడదు.
2.సూర్యోదయం..సూర్యాస్తమయంలో నిద్రించేవారు ,భుజించేవారు,పగటి పూట నిద్రించేవారు లక్ష్మికృపకు పాత్రులు కాలేరు
3.శుచి,శుభ్రత,సహనం,కలిగి ధార్మికంగా,నైతికంగా జీవించేవారు లక్ష్మికటాక్షాన్ని పొందుతారు.
4.చిల్లరపైసలు,పువ్వులు,నిర్లక్ష్యంగా పడేసేవారు,ముక్కొపులు,దురహంకారం,వున్న వారు లక్ష్మికటాక్షాన్ని పొందలేరు.
5.బద్దకస్తులు ,అతిగా మాట్లాడేవారు.అమితంగా తినేవారు,గురువులను పెద్దలను అవమానించేవారు,ఇంట లక్ష్మిదేవి నిలవదు.
6.లక్ష్మిదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చ వస్త్రాలుదరించిఅమెకు ఎర్రని వస్త్రాలు ను,పరిమళభరిత పూలను అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించినట్లుయితే లక్ష్మికటాక్షం పొందుతారు.
7.ఇంటో లక్ష్మిదేవి పద్మంలో కూర్చున్నపటం కి మాత్రమే పూజించాలి.