లక్ష్మి కటాక్షం ఎలా కలుగుతుంది..
`శంఖంలో నీరు నింపి లక్ష్మీదేవి చిత్రం లేదా ప్రతిమ రెండు పాదాలు కడిగి ,తరువాత దీప దూపాదులతో పూజించి ,నమస్కరించాలి
`పూజాస్దలంలో దక్షిణ వర్త శంఖం ఉంచి నిత్యం ధూప దీపాదులతో పూజించాలి
`ప్రతి దినం ఉదయం స్నానం చేసి శంఖంలో జలం నింపి తులసిమొక్కకు సమర్పించాలి.అక్కడ దీపదూపాదులు వెలిగించి నమస్కరించి ప్రసాదంగా ఒక తులసి పత్రం తీసుకొని నోట్లో వేసుకోవాలి
`మాసంలోని మొదటి శుక్రువారం ఒక మోతీ శంఖం తీసుకుని అందులో వెండినాణెంవేసి ముడిబియ్యం,నింపాలి.ఆ శంఖం ఒక ఎర్రని వస్త్రంలో ఉంచి కుంకుమ లేక పసుపుతో తిలకం పెట్టి తామరగింజల మాలతో ఓం శ్రీం శ్రియాjైునమ: మంత్రాన్ని యధాశక్తి జపించాలి.ఇలా ఐదు శుక్రువారాలు జపం చేయాలి.చివరి శుక్రువారం నాడు ఒక కన్యకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి పంపించాలి.తరువాత శంఖం ఎర్రని వస్త్రంలో చుట్టి ధనస్దానంలో ఉంచాలి.ఇలా చేస్తే ఆర్దికంగా స్దిరత్వం ఆర్దిక ఇబ్బందులు తొలిగి సుఖసంతోషాలుతో వుంటారు.