లక్ష్యమే టార్గెట్ `జిల్లా ఎస్‌పి జి.ఆర్.రాధిక
శ్రీకాకుళం: ప్రతి పోలీసు అధికారి లక్ష్యమే టార్గెట్‌గా ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్‌పి జి.ఆర్.రాధిక అన్నారు.జిల్లా ఆర్క్‌రిజర్వు పోలీసు కార్యాలయం చిన్నరావుపల్లి ఫైరింగ్ రేంజ్ నందు శనివారం నిర్వహించే ఆర్ద వార్షిక ఫైరింగ్ సాధన ప్రక్రయలో ఎస్‌పి పాల్గోన్నారు.ఈ సందర్బంగా జిల్లా పోలీసు అదికార్లుకు స్వయంగా పాల్గోని ఫైరింగ్ మెళికలు నేర్పిమనోధైర్యాన్ని నింపారు.ఫైరింగ్‌లో ప్రతి ఒక్కరూ మెళికలు నేర్చుకుని ఫైరింగ్ పై అనుమానాలకు వుంటే నివృత్తి చేసుకోవాలని అన్నారు.ప్రతి ఒక్క బుల్లెట్ టార్గెట్ వైపే చూడాలని అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుని ,జిల్లా పోలీసుశాఖ యొక్క ఉన్నతి కోసం ముందుడుగు వేయాలని ఎస్‌పి అన్నారు.