వంశధార కాలువలు పనులు ఆధునీకరణకు సిఎం సానుకూలం
అమరావతి: వంశధార ప్రాజెక్టు కాలువలు ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని వైఎస్సాఆర్ పార్టీ యువనేత ధర్మాన క్రిష్ణచైతన్య గురువారం సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.డిప్యూటీ సిఎం దర్మాన క్రిష్ణదాసు సహకారంతో పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ ప్రాజెక్టు పనులు ఆధునీకరణ జరిగితే 1.50లక్షలు ఎకరాలుకు మూడు పంటలకు సరిపడు సాగునీరు అందుతుందని కృష్ణచైతన్య సిఎంకు తెలిపారు.జలవనరులు శాఖాదికారులు ఇప్పటికే ఈ పనులుకోసం 5.50కోట్లు అంచనాలు రూపొందించారని నిధులు మంజూరు త్వరితగతిన జరిగితే పనులు ప్రారంభం వేగవంతం అవుతుందిని సిఎం ప్రత్యేక దృష్టి చేపట్టి నిధులు మంజూరు చేయాలని కోరారు.దీనిపై సిఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.