వణికిస్తున్న చలి
విశాఖపట్నం: ఉత్తరాంద్రలో ప్రజలు చలిగాలులుతో వణికిపోతున్నారు.ముఖ్యంగా అటవీప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో అక్కడ ప్రజలు,చలితో ఇంటినుండి బయటకు రాలేని పరిస్దితి నెలకుంది.విశాఖపట్నంలోని లంబసింగి ప్రాంతంలో 3.8డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యందంటే అక్కడ పరిస్దితి ఎలావుంటుందో తెలుస్తుంది.మరో రెండు రోజలు వాతావరణ పరిస్దితులు ఇలాగే వుంటాయని వాతావరణ శాఖ తెలుపుతుండడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.