వామ్మో …ఇన్ని ఫైన్‌లా…
శ్రీకాకుళం: ఒకవైపు ట్రాఫిక్ నిబందనలు కఠిన తరం చేసినా మరో వైపు వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందినే బురిడీ కొట్టించేస్తున్నారు.అయితే ఏదో ఒక రోజు దొరక్క తప్పదు అదే అక్షరాలు నిజమైంది.రాష్ట్రంలోనే ఇన్ని ఫైన్‌లు వున్న వాహనం వుండకపోవచ్చు.శ్రీకాకుళం పట్టణంలోని రైతు బజారు వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ పొలిమిటి పున్నయ్య వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా ఈ వాహనం చిక్కింది.తీరా బైక్ ఆపి తనిఖీ నిర్వహించేటప్పుడు కళ్లు చెదిరే నిజాలు భయటపడ్డాయి.ఏకంగా 33ఫైన్‌లు సుమారు 8వేలు రుపాయిలు అపరాదరుసుంతో వుంది.ఈ సంఘటన చూసి పున్నయ్యతో పాటు ట్రాఫిక్‌సిబ్బంది నివ్వెరపోయారు.ఈ వాహనం విశాఖపట్నంలో రిజస్టేషన్ ఆయిందని ,తెలిసింది.2018నుండి ఈ ఫైన్‌లు వున్నాయని,వాహనాన్ని ట్రాఫిక్ స్టేషన్‌కు తరలించామని పున్నయ్య తెలిపారు.వివరాలు ప్రకారం వాహనం రిజస్ట్రేషన్ సరిపోవడంతో వాహనాన్ని ఫైన్ లు కట్టి విడుదల చేసుకోవాలని తెలిపారు.వున్న ఫైన్‌లు అన్నీ ట్రాఫిక్ నిబందనలు విరుద్దంగా,త్రిపుల్ రైడిరగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ పార్కింగ్,డ్రైవింగ్ లైసెన్పు లేకుండా వాహనం నడపటం,ఇన్సూరెన్పు లేకుండా వుండడం, వున్నవేనని,అందువల్ల నిబందనలు విరుద్దంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలువుంటాయని తెలిపారు.˜