వికలాంగులు సమస్యలువెంటనే పరిష్కరించాలి

0
158
telugu news

వికలాంగులు సమస్యలువెంటనే పరిష్కరించాలి
శ్రీకాకుళం: దీర్ఘకాలికంగా పెండిరగ్లో వున్న వికలాంగులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర నాయుకులు కృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు.శ్రీకాకుళంలో ఆదివారం వికలాంగులు చేపట్టే ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఇపుడు ఇస్తున్న ఫించను ను 3వేలు నుండి 6వేలుకు పెంచాలని వారు రిజర్వేషను కూడా నాలుగు శాతం నుండి ఏడు శాతానికి పెంచాలని అన్నారు.రాష్ట్రప్రభుత్వం ముందు 32సమస్యలు పెండిరగ్‌లో వున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు.వివాహ ఖర్చులకు లక్షాఏబైవేలు ఇస్తున్నారని దాన్ని ఐదు లక్షలకు పెంచాలని చట్టసభలలో కూడా వారికి సముచిత స్దానం వుండేలా ప్రభుత్వంచర్యలు తీసుకోవాలని అన్నారు.సమస్యలు పరిష్కారం కాకపోతే మండల స్దాయిలో ధర్నాలు ఆ తరువాత ఛలో అమరావతి పిలుపునిస్తామని,అమరావతి లోని తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.అంతకుముందు వికలాంగులుతో పాదయాత్ర నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here