వేసవితాపానికి చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయి
ఎచ్చెర్ల మండలం ఫరీదు పేటకు చెందిన కంచరాన ఉమామహేశ్వరరావు శ్రీకాకుళం పట్టణంలోని వివిద కూడలిలు వద్ద చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తన తండ్రి చిన్నారావు జ్ఞాపకార్దం ఈ కేంద్రాలు ఏర్పాటుచేయుడం జరుగుతుందని ,మజ్జిగ సేవించిన ప్రజలు ,ట్రాఫిక్‌లో విధినిర్వహణలోవున్న ట్రాఫిక్ సిబ్బందికూడా మజ్జిగ సేవిస్తున్నారని ,ఇటువంటి కార్యక్రమాలు ,సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారని ఉమామహేశ్వరరావు అన్నారు.ఇటువంటి కార్యక్రమాలు చేయుడం వివిద ప్రదాన కూడలి వద్ద ఇటువంటి మజ్జిగ సరఫరా కేంద్రాలు ఏర్పాటుచేయుడం వేసవి వడదెబ్బ తగలకుండా ఎంతో సహకరిస్తుందని ట్రాఫిక్‌సిబ్బంది కూడా ప్రశంసిస్తున్నారు.మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని వారు సూచించారు.