వైభవంగా ఆదిత్యుని కళ్యాణం
అరసవల్లి : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదిత్యుని కళ్యాణం కన్నులు పండుగగా నిర్వహించారు.అనివెట్టి మండపంలో ఉషా,పద్మిణీ,ఛాయ సమేత ఆదిత్యుని కళ్యాణం జరిగింది.మార్గశీర్షశుద్ద ఏకాదశిని పురస్కరించుకుని ఈ కళ్యాణం నిర్వహించామని ప్రదాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.వేద మంత్రాలు ,మంగళవాయిద్యాలు నడుమ శాస్రయుక్తంగా కళ్యాణం జరిపారు.ఈ కార్యక్రమంలో ఆలయకార్యనిర్వాహనాదికారి వి.హరి సూర్యప్రకాశ్ పాల్గోన్నారు.